కలెక్టరేట్, నవంబర్ 17 : టీజీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్ష ఉమ్మడి జిల్లాలో మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల నిబంధనలపై అధికార యంత్రాంగం ముందుగానే సూచనలు చేయడంతో అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. నిమిషం నిబంధన ఉండడంతో మరికొందరు చేరుకోలేక వెనుదిరిగిపోయారు. హాజరైన వారి హాల్టికెట్, గుర్తింపు కార్డులను సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి లోనికి పంపించారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగలేదు.