Groom | మెట్పల్లి రూరల్, మార్చి 8 : ఓ వైపు పెళ్లి పనులతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో వరుడు బలవన్మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లికి ఒకరోజు ముందే వరుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెట్పల్లి మండలం వెల్లుల్ల అనుబంధ గ్రామమైన రామచంద్రంపేటలో ఇవాళ చోటు చేసుకుంది.
మెట్పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. రామచంద్రంపేటకు చెందిన లక్కంపెల్లి కిరణ్(37) మెట్పల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. వెల్లుల్ల గ్రామానికి చెందిన ఓ యువతితో కిరణ్‌కు పెద్దలు వివాహం నిశ్చయించారు. ఈ నెల 9న వీరి వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లి పనులతో ఇరు కుటుంబాల్లో సందడి నెలకొంది.
శనివారం పందిరి కార్యక్రమం ఉండగా, శుక్రవారం రాత్రి వరుడు కిరణ్ తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూడగా, ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. కిందికి దింపి చూడగా, అప్పటికే మృతిచెందాడు.
రేపు పెళ్లి అనగా, ఒకరోజు ముందే వరుడు తనువు చాలించడంతో ఆ ఇంటితో పాటు గ్రామంలో విషాదం నెలకొంది. కాగా కిరణ్ ఆరోగ్య సమస్యలు ఉండడంతో పెళ్లి తర్వాత గొడవలు జరుగుతాయని మానసికంగా కృంగిపోయి, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్