వీణవంక, మే 8 : మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి అప్పని హరీశ్ వర్మ మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను కరీంనగర్‌లోని వారి నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కరీంనగర్ రూరల్, మే 8 : మండలంలోని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా ఆపరేషన్ సింధూర్ సైనిక సహాయార్థ్థం రక్తదానం చేశారు. కరీంనగర్లో ఆరోగ్య రక్త సేకరణ కేంద్రంలో మండలంలోని దుబ్బపల్లికి చెంది న మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బతి రంగారెడ్డి, చెర్లభూత్కూర్ గ్రామాధ్యక్షుడు కూర శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆరోగ్య రక్త నిధి సెంటర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి, కరీంనగర్ మండల నాయకులు ఆరోగ్య బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన బీఆర్ఎస్ మండల కార్యకర్తలను పార్టీ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాం సుందర్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో చెర్లభూత్కూర్, దుబ్బపల్లి, చామనపల్లి గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, గంగుల కమలాకర్ అభిమానులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, మే 8 : చింతకుంటలోని రాజీవ్ గృహకల్ప సైట్లో మొక్కలు నాటారు. అలాగే జీకే యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మండలానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు దేశ సైనికుల సహా యార్థం రక్తదానం చేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు, వైఎస్ ఎంపీపీ తిరుపతి నాయక్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.