Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 10 : మల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు గత ఐదు నెలలుగా జీతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది తమకు జీతాలు విడుదలయ్యే వరకూ సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు ఎంపీడీవో శ్రీకాంత్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో తమ శక్తి మేరకు విధులు నిర్వరిస్తున్నామని, వేతనాల రాకపోవడంతో అప్పులు తెచ్చుకొని జీవనోపాది పొందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు అనిల్, విజయ్, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.