జగిత్యాల టౌన్, జనవరి 1: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని, పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా శాఖ రూపొందించిన 2023 సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయుల వెంట ఉంటానన్నారు. చక్కటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తు న్న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులందిరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తపస్ నాయకులు మాట్లాడుతూ, బదిలీలు, ప్రమోషన్లు వెంటనే ఇప్పించాలని 317 జీవో ద్వారా బ దిలీ అయిన టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స మస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య, బోయినపల్లి ప్రసాదరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అయిల్నేని నరేందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, వార్డు కౌన్సిలర్ చుక్క నవీన్, రాష్ట్ర బాధ్యులు గడ్డం మైపాల్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, మహిళా కో-కన్వీనర్ శ్రావణి, జిల్లా ప్రచార కార్యదర్శి రామకృష్ణ, జిల్లా నాయకులు గుర్రాల ప్రేమ్‌కుమార్, అందె శివప్రసాద్, కాశెట్టి రమేశ్, కన్నవేణి మల్లారెడ్డి, జగిత్యాల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘునందన్, రాజేందర్, రమేశ్, రజినీకాంత్, వివిధ మండలాల, రాష్ట్ర, జిల్లా బాధ్యులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ
జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్లో పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీఆర్టీయూ 2023 సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాళ్ల అమర్నాథ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనంద్‌రావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఏవీఎన్ రాజు, బొమ్మకంటి రవి, ఊటూరి మహేశ్, సంది శ్రీనివాస్‌రెడ్డి, వెంకట సుధీర్, మహిళా నాయకులు ఉజగిరి జమున, సురేఖ, అనిత, వసంత, చందన, విద్య, పద్మ, తరంగిణి, నాగరాణి, రాష్ట్ర, జిల్లా బాధ్యులు సత్యరాజ్, సత్యనారాయణరావు, పొన్నం రమేశ్, రాజగోపాల్, లింగారెడ్డి, మచ్చ రాజశేఖర్, అనిల్, భూపాల్, విజయ్ 18 మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన టీఎన్జీవో నేతలు
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బోగ శశిధర్, జిల్లా కార్యదర్శి నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌కు పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీఎన్జీవోల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు రవిచంద్ర, రవీందర్, సుగుణాకర్, మధుకర్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.