గంజాయి ముఠా గుట్టురట్టు
గంజాయి ముఠా గుట్టు రట్టయింది. అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు రాయికల్‌లో పట్టుబడ్డారు. వీరిలో పదహారండ్ల బాలుడు కూడా ఉన్నాడు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, బైక్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
- అక్రమంగా తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
- పట్టుబడ్డ వారిలో పదహారేండ్ల బాలుడు
- 1.5 కిలోల గంజాయి, బైక్, మూడు సెల్ఫోన్ల స్వాధీనం
- వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్
రాయికల్, మార్చి 28: గంజాయి ముఠా గుట్టు రట్టయింది. అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు రాయికల్‌లో పట్టుబడ్డారు. వీరిలో పదహారండ్ల బాలుడు కూడా ఉన్నాడు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, బైక్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాయికల్ ఠాణాలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. జగిత్యాలకు చెందిన కొండూరి రాజేశ్, ఆరుముళ్ల సాయికుమార్, రాయికల్‌కు చెందిన పెనుగొండ గణేశ్, మలవాత్ సతీశ్ ముఠాగా ఏర్పడి పట్టణానికి చెందిన ఓ పదహారేండ్ల బాలుడి వద్ద గంజాయిని కొనుగోలు చేసి జగిత్యాలలో యువతకు విక్రయిస్తున్నారు.
వీరు గంజాయి, చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో కొండూరి రాజేశ్, ఆరుముళ్ల సాయికుమార్, బాలుడితో కలిసి 1.5 కిలోల గంజాయితో గురువారం బైక్‌పై రాయికల్‌కు బయల్దేరారు. ముందస్తు సమాచారం మేరకు జగిత్యాల రూరల్ సీఐ ఆరీఫ్ అలీఖాన్, రాయికల్ ఎస్ఐ అజయ్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ సీఐ, రాయికల్ ఎస్ఐ కానిస్టేబుళ్లు సాగర్, ప్రశాంత్‌ను జిల్లా ఎస్పీ, డీఎస్పీ అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

