Gangula kamalakar | కరీంనగర్‌కు కేటీఆర్ రావడం వల్ల ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ప్రతిపక్ష నాయకుడిగా తప్పకుండా మాట్లాడుతారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడండి.. ఇక ముందు ఇలా జరుగొద్దని చెప్పడంతోపాటు ప్రతిపక్ష నాయకుడి కొన్ని సమాచారాలు వస్తాయి. అది కేంద్రప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఉన్న నాయకుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఓ ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా స్పందించాలే.. దానికి అనుగుణంగానే ఆ రోజు బండిసంజయ్ గారు మీరు స్పందించండి. కేంద్రంలో మీరు మంత్రివర్గంలో ఉన్నరు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉన్నది. మేం కాంగ్రెస్ మీద పోరాడుతున్నం. రేవంత్ రెడ్డి మీద పోరాడుతున్నం. మీరు కూడా రేవంత్ రెడ్డి మీద పోరాటం చేసి శాంతి భద్రతలు చూసే బాధ్యత మీపై ఉందన్నారు.
ఒక కేంద్ర సహాయ మంత్రిగా కరీంనగర్ ఇంత పెద్ద ఘటన జరిగితే కూడా మీరు రాష్ట్రప్రభుత్వం మీద ఎదురుదాడి చేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పడంలో భాగంగా ప్రతిపక్ష నాయకుడు ఆరోపణ చేస్తే దాన్సి స్వీకరించాలి. కానీ బండి సంజయ్ చాలా ఫ్రస్టేషన్‌కు గురై ఇష్టానుసారంగా ప్రజలు కూడా కనీసం గౌరవం ఇవ్వలేని భాషను మేము తీవ్రంగా ఖండిస్తున్నం. బండి సంజయ్ మీరు కేంద్రమంత్రి. కేంద్రంలో ఉన్న ముఖ్యమైన శాఖ హోంశాఖ మాత్యులు మీరు. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ మాట్లాడితే దాన్ని రిసీవ్ చేసుకుని దానికి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సి ఉండాల్సిందే. కానీ నీ ఫ్రెస్టేషన్ వల్ల ప్రజలను అపహాస్యం చేసే విధంగా మాట్లాడటం ఖండిస్తున్నమన్నారు.
కేంద్రమంత్రి అనే సోయి మరిచిపోయినవ్..
నువ్వొక ఎంపీవి, ఒక హోం మినిస్టర్వి.. నువ్వొక బీజేపీ కార్యకర్త అనుకున్నవా..? కేంద్రమంత్రి అనే సోయి మరిచిపోయినవని గంగుల ప్రశ్నించారు. నువ్వు కేంద్రమంత్రిగా ఉన్నది గుర్తు పెట్టుకో. రాజ్యాంగ పరిధిలో మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తయి. వాటిని రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలే. కానీ ఈ రోజు ఒక బీజేపీ కార్యకర్తలా ఒక వ్యక్తిగత విషయంలో తల్లీ, తండ్రీ అనే ప్రశ్నించే విధంగా మాట్లాడితే ఎలా..? మేం అలాంటి మాటలు మాట్లాడం. రేవంత్ రెడ్డిపై దాడి చేస్తుంటే నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నవ్. నువ్వు హోం మినిస్టర్వు. సహాయమంత్రివి.. రేవంత్ రెడ్డికి కాదు నువ్వు సహాయమంత్రివి.
దేశానికి సహాయ మంత్రివి కాబట్టి రేవంత్ రెడ్డిని మేం అంటుంటే ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు మాకు మద్దతుగా రావాల్సిన బాధ్యత నీకుండే. కానీ ఈ రోజు కేటీఆర్ మీద వాడిన భాష చాలా సిగ్గుపడుతున్నం. మీరు మా ఎంపీ, కేంద్రమంత్రివి. కానీ ఇలాంటి భాష పట్ల చాలా సిగ్గుపడుతున్నం. ఇక ముందు కూడా నువ్వు కేంద్రమంత్రివి అనుకొని ఇలాంటి భాష మార్చుకోమని అడుగుతున్నం. నువ్వు రెండు సార్లు ఎంపీవి. మీరు కేటీఆర్ మాట్లాడితే ఎదురుదాడికి దిగడం కాదు. మీరు ఎప్పుడైతే కేంద్రమంత్రి కక్కర్‌ను తీసుకొచ్చినప్పుడు మీరిచ్చిన హామీలపై మొదట శ్రద్ద పెట్టండి. కరీంనగర్లో ఉన్న డంప్ యార్డ్ తీసేస్తమని చెప్పి ఆ మంత్రితో చెప్పారు. మరచిపోతున్నరా.. మీరు వెంటనే ఆ దిశగా ప్రయత్నం చేయండని సూచించారు. మీ పరిధిలో కేంద్రానికి సంబంధించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి ఉంది.. అది ఇప్పటికీ నత్తనడకన నడుస్తుంది. దాని మీద ఫోకస్ పెట్టండని గంగుల కమలాకర్ కోరారు.
LIVE: BRS Leaders press meet at Telangana Bhavan https://t.co/jv6Ih6cT89
— BRS Party (@BRSparty) May 6, 2026