Former MLA Satish Kumar | చిగురుమామిడి, సెప్టెంబర్ 5: గణేష్ నిమజ్జన పర్వదిన పురస్కరించుకొని శుక్రవారం మండలంలో గణేష్ విగ్రహానికి ఘనంగా పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి కటాక్షంతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో కళకళలాడాలని కోరుకున్నట్లు తెలిపారు.
నిమజ్జన వేడుకలు శాంతియుతంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. కాగా మండలంలో నిమజ్జన వేడుకల్లో ఎలాంటి శాంతి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎస్సై సాయి కృష్ణ పర్యవేక్షణ నిర్వహించారు.