Freshers’ Day celebrations | చిగురుమామిడి, సెప్టెంబర్ 20: చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శశిధర్ శర్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి డీఐఈఓ గంగాధర్ హాజరయ్యారు. ప్రతీ విద్యార్థి ప్రణాళిక బద్ధంగా చదువుతూ కళాశాలలో ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు.
జిల్లాలోనే చిగురుమామిడి కళాశాలను ప్రథమ స్థానంలో నిలబడేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.