medical camp | కోరుట్ల, ఏప్రిల్ 7: పట్టణంలోని కింగ్స్ గార్డెన్ లో సోమవారం జమాతే ఇస్లామిక్ హిందూ ఆధ్వర్యంలో పట్టణ ఐఎంఏ, కెమాగ్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో మహిళలకు వివిధ రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేశారు.
పిల్లల, కంటి, దంత, గైనకాలజిస్టు, జనరల్ ఫిజీషియన్, సర్జన్లు, ఎముకల వైద్య నిపుణులు రోగులకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరాన్ని కెమాగ్స్ అధ్యక్షురాలు స్వీతి అనూప్ రావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు అనూప్ రావు, రాజేష్, జగదీశ్వర్, దిలీప్ రావు,మనోజ్ కుమార్, నరేష్, రమేష్, ఇంద్రనీల్, అనురాధ, దీప్తి, తదితరులు పాల్గొన్నారు.