Kalvasrirampur | కుష్టివ్యాధి నివారణకు ఉచిత మందులు.. పెద్దపల్లి జిల్లా పారామెడికల్ అధికారి దేవి సింగ్
కుష్టి వ్యాధికి ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తుందని పెద్దపల్లి జిల్లా పార మెడికల్ అధికారి బీ దేవి సింగ్ అన్నారు.
Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, ఫిబ్రవరి 9 : కుష్టి వ్యాధికి ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తుందని పెద్దపల్లి జిల్లా పార మెడికల్ అధికారి బీ దేవి సింగ్ అన్నారు. కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని 15 రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా స్లాక్ అనే కార్యక్రమం ద్వారా మండల కేంద్రంలోని వాసవి డిగ్రీ కళాశాలలో కుష్టు వ్యాధి నివారణ పై విద్యార్థులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవి సింగ్ మాట్లాడుతూ కుష్టి వ్యాధి వస్తే ప్రారంభ దశలోనే గుర్తించి ఎండీటీ అనే బహుళ ఔషధ చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఈ మందులు ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. శరీరంపై మొద్దు బారిన మచ్చలు ఏర్పడే అవి రాగి రంగులో ఉంటాయి అన్నారు.
చర్మం పాలిపోయినట్లు ఉండి మచ్చలపై చెమట రాకకుండా ఉండడంతోపాటు చర్మం కంటే మచ్చలు ఉబెత్తుగా ఉండే ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారు కేంద్రంలో డాక్టర్ ను సంప్రదించి మందులు వాడినట్లయితే ఎలాంటి అంగవైకల్యం రాకుండా పూర్తిగా తగ్గిపోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీనివాస్, మహేందర్, సత్యనారాయణ రావు, హెచ్ఈఓ శ్రీనివాస్ వినీత్, కళాశాల ప్రిన్సిపాల్ జక్కుల కుమార్, ఏఎన్ఎం సూత్రాల సరోజన, ఆశా కార్యకర్తలు శారద, భూలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

