Free medical camp | మల్లాపూర్, జూలై 13 : మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో ఆదివారం మెట్పల్లికి చెందిన సిరి పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ చిలుక చైతన్య 90 మంది పిల్లలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ చిలుక చైతన్య మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇతర కాలుష్యాల వల్ల ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడుతున్నారని, ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యం పట్ల నిర్లక్షం చేయవద్దని సూచించారు. ప్రతీఒక్కరూ ఎప్పటికప్పుడు పిల్లలకు వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ చిలుక చైతన్యను వివిధ పార్టీల నాయకులు శాలువా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లాల జలపతి రెడ్డి, మాజీ జడ్పీటీసి సంధిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, పద్మశాలి మండల అధ్యక్షుడు అయ్యోరి దశరథం, వీడీసీ చైర్మన్ గంగరాజం, నాయకులు పూండ్ర శ్రీనివాస్ రెడ్డి, ముద్దం శరత్, కోటగిరి ఆనంద్ గౌడ్, లవంగ శివ, సరికెళ్ల మహిపాల్, ముద్దం సత్యం, ఆర్ఎంపీలు నరేందర్, గంగరాజం, తదితరులు పాల్గొన్నారు.