Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 12: మండలంలోని రేకొండ ఎంపీటీసీ చాడ శోభ (63)అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. చాడ శోభ రేకొండ ఎంపీటీసీగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వారి భర్త మాజీ ఎంపీపీ స్వర్గీయ చాడ ప్రభాకర్ రెడ్డి స్ఫూర్తితో ప్రజాసేవ చేపట్టారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
బుధవారం చాతిలో నొప్పి రావడంతో గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. కాగా దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతోమృతి చెందారు. వీరికి సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, చాడ మురళీధర్ రెడ్డి కుమారులు కలరు. చాడ శోభ మృతి పట్ల సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొత్త వినీతశ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటీసీ లు అందే స్వామి, కూన శోభారాణి, గీకురు రవీంద, సీపీఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, బోయిని అశోక్, బద్దిపడగ రాజిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.