మళ్లీ మోసపోవద్దు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా మోసం చేసిందని, ఇప్పుడు మళ్లీ ఓట్లు వేసి మోసపోవద్దని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 30, 32, 38 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు.
- బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి
- మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 7 : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా మోసం చేసిందని, ఇప్పుడు మళ్లీ ఓట్లు వేసి మోసపోవద్దని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 30, 32, 38 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై బురదజల్లుతూ పొద్దుగడుపుతున్నారని ఆరోపించారు.
దేశంలో ఇలాంటి దికుమాలిన ముఖ్యమంత్రిని ఎకడా చూడలేదన్నారు. నోరుతెరిస్తే బూతులతో సీఎం అనే హోదాను మరిచిపోయి వీధిరౌడీలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఒక ఉచిత బస్సు తప్ప మరో హామీని అమలు చేయలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రతి నియోజకవర్గంలో ముస్లింలు చదువుకునేందుకు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు.
ఇందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్లను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, ఎంఐఎం ముస్లింలకు ఏనాడూ న్యాయం చేయలేదన్నారు. ముస్లింలు కాంగ్రెస్ చెప్పే మాయమాటలు నమ్మి ఓటేసి ఇబ్బందులు పడవద్దని సూచించారు. ఇప్పుడు నిధులు తెస్తామని చెప్పుకుంటున్న బండి సంజయ్ గత ఐదేళ్లలో ఎంపీగా ఉండి ఏం తీసుకువచ్చారని ప్రశ్నించారు. నగరంలో మరింత అభివృద్ది జరగాలంటే బీఆర్ఎస్ మేయర్ ఉండాలన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు నక్క పద్మ కృష్ణ. యూసుఫ్, మాధవి పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

