కార్పొరేషన్, ఫిబ్రవరి 5 : ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఆటో కార్మికుల సమస్యల సాధన కోసం కృషి చేస్తామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆటో కార్మిక నాయకులకు భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ కల్పించిన తర్వాత ఆటోల్లో ఎవరూ ఎకక పోవడంతో మా బతుకులు ఆగం అవుతున్నాయని కరీంనగర్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఆటో యూనియన్ నాయకులు సోమవారం సాయంత్రం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కలిసి తమ బాధలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం కారణంగా గిరాకీ తగ్గడంతో కుటుంబాలను పోషించుకోలేక, ఈఎంఐలు, పిల్లల ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నామని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, తమకు ఎలాంటి ఆధారం లేదని, తమ సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించి, బతుకులను నిలబెట్టాలని మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఆటో కార్మికులకు నెలకు రూ.15 వేల భృతి ప్రభుత్వం ఇవ్వాలని, ప్రత్యేకంగా మహిళలకు బస్సులతో పాటు ఆటోల్లో ఎకే విధంగా ఆటో కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ పట్టణాధ్యక్షుడు మద్దెల రాజేందర్, ప్రధాన కార్యదర్శి బండారి సంపత్, ఉపాధ్యక్షుడు నర్సింహా నాయక్, కుమార్, పురుషోత్తమాచారి, మహేందర్, ప్రభాకర్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.