తిమ్మాపూర్, జూలై 8 : నాలుగేళ్ల క్రితం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాలకు కవ్వంపల్లి సత్యనారాయణకు ఏం సంబంధమని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. చరిత్రలో చూడని ఒక దళిత ద్రోహి ఆయన అని ఘాటుగా విమర్శించారు. ఆవిష్కరించిన విగ్రహాలకు ఎందుకు ముసుగులు వేయిస్తున్నావని మండిపడ్డారు. నాలుగేళ్ల క్రితం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాలకు కవ్వంపల్లి సత్యనారాయణకు ఏం సంబంధమని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. చరిత్రలో చూడని ఒక దళిత ద్రోహి ఆయన అని ఘాటుగా విమర్శించారు. ఆవిష్కరించిన విగ్రహాలకు ఎందుకు ముసుగులు వేయిస్తున్నావని మండిపడ్డారు. ఆ విగ్రహాల జోలికొస్తే ఊరుకునేది లేదని, ఖబడ్దార్ కవ్వంపల్లి అని హెచ్చరించారు. తిమ్మాపూర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న తిమ్మాపూర్‌లోని ఆర్టీసీ ప్రాంగణంలో మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆవిష్కరణ ఆలస్యమైందని చెప్పారు. ఆ విగ్రహాలు ముసుగులు వేసి ఉండడంతో దళిత సంఘాల మండల నాయకుల విజ్ఞప్తి మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి విన్నవించామని చెప్పారు. ఇటీవల తాను విగ్రహాలను ఆవిష్కరించానని, అయితే నాకు ఎక్కడ పేరువస్తుందోనని ఎమ్మెల్యే కవ్వంపల్లి అధికార మదంతో ముసుగులు వేయించారని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యేగా గెలిచిన నెలలోపే విగ్రహాలను ఆవిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఆయన, రెండున్నరేళ్లుగా ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. రూ.కోటితో సుందరీకరణ చేస్తానన్న ఆయన పర్మిషన్ ఏమైందని మండిపడ్డారు. నువ్వెన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, జైలుకు పోయైనా.. ప్రాణాలు ఇచ్చయినా విగ్రహాలను మళ్లీ ఆవిష్కరించి తీరుతానని స్పష్టం చేశారు. ఆవిష్కరించి పాలాభిషేకం చేసిన విగ్రహాలకు పాత గుడ్డలు చుట్టి ఉరివేసినట్టు తాళ్లతో కట్టడం చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితుల ఫంక్షన్ల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన నిర్మించిన అరుంధతి కల్యాణ మండపాన్ని వెంటనే దళిత సంఘాల నాయకులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కవ్వంపల్లి తన వద్ద ఉండే కిషన్‌రెడ్డి అనే వ్యక్తికి కిరాయికి ఇచ్చుకున్నారని ఆరోపించారు. అది దళితుల కోసం నిర్మించానని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, సర్పంచులు తిరుపతి, అవుదుర్తి రాంకిషన్, నాయకులు పాశం అశోక్‌రెడ్డి, వంతడుపుల సంపత్, బోయిని కోమురయ్య, నాయిని వెంకట్‌రెడ్డి, సంగుపట్ల కోమురయ్య, వడ్లూరి శంకర్, బోయిని తిరపతి, మహేశ్, గడ్డి రమేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.