Rasamayi Balakishan | గన్నేరువరం, జనవరి 17 : గన్నేరువరం మండలంలోని మైలారం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ భ్రమరాంబ సమేత స్వయంభూ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ నాయకులు సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న, ఆలయ చైర్మన్ వరాల పర్శరాములు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.