గోదావరిఖని, జూలై 14: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తేల్చిచెప్పారు. ప్రజాసమస్యలను తెలుసుకొనేందు కు త్వరలోనే ‘రామగుండం రచ్చబండ’ పేరి ట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఆదివారం గోదావరిఖనిలోని బీఆర్ఎ స్ ఆఫీస్‌లో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభు త్వం అధికారం చేపట్టి ఏడు నెలలు గడిచినా గ్యారెంటీల అమల్లో నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. వెంటనే మహిళలకు ప్రతినె లా రూ. 2500, ఎకరాకు రూ. 15వేల రైతు భరో సా, ఆసరా పింఛన్ల పెంపు, రైతులకు రుణమాఫీ తదితర హామీలను నెరవేర్చాలన్నారు. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి నిరుద్యోగుల కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గుబ్లాకుల వేలంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాన్ని రచ్చబండ వేదికగా ఎండగడతామని స్పష్టం చేశారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ సాధనకు జైలుకు వెళ్లి కేసుల పాలైన విషయాన్ని గుర్తు చేశారు. తన హయాంలో రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయిం చి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేర్చానని చెప్పారు.
నియోజకవర్గంలో పార్టీ పూర్వవైభవం కోసం నాయకులు, కార్యకర్త లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పీటీ స్వామి, నడిపెల్లి మురళీధర్‌రావు, ఆముల నారాయణ, కార్పొరేటర్లు కన్నూరి సతీశ్‌కుమార్, కల్వచర్ల క్రిష్ణవేణి, బాదె అంజ లి, అడ్డాల గట్టయ్య, జనగామ కవిత సరోజనీ, నేతలు జేవీ రాజు, పర్లపల్లి రవి, మాదా సు రామమూర్తి, జహిద్పాషా, రాకం వేణు, నారాయణదాసు మారుతి, కౌటం బాబు, చల్లగురుల మొగిలి, పిల్లి రమేశ్, బొడ్డు రవీందర్, తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్ ఉన్నారు.