కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా శుక్రవారం రాత్రి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రచారం నిర్వహించారు. మంకమ్మతోట నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రాంనగర్ చౌరస్తా వరకు ప్రచార ర్యాలీ తీశారు.
రాంనగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కాగా, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆసక్తిగా విన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-కార్పొరేషన్, ఏప్రిల్ 12