Koppula Eshwar | ధర్మారం, ఏప్రిల్ 27 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో శ్రీ లక్ష్మి నృసింహ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆ గ్రామ సర్పంచి మోతె కనకయ్య ఆహ్వానించారు. ఈనెల 25 తేదీ నుంచి మే 2 వరకు స్వామి బ్రహ్మోత్సవాలు, జాతరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ ఉత్సవాలకు హాజరు కావాలని సర్పంచ్ కనకయ్య తో పాటు మాజీ ఉప సర్పంచ్ కీసర స్వామి, బీఆర్ఎస్ నాయకులు పాకాల రాజయ్య, గట్టు స్వామి కలిసి ఆహ్వానించారు.