సింగరేణికి జలగలా పట్టిన రేవంత్ సర్కారు
సింగరేణి సంస్థకు రేవత్ సర్కారు జలగలా పట్టిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. బకాయిల కోసం అధికారులు ఆరు రోజులుగా రోడ్డెక్కి నిరాహార దీక్షలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.
- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజం
- సింగరేణి అధికారుల దీక్షను సందర్శించి సంఘీభావం
రామగిరి, జూలై 4: సింగరేణి సంస్థకు రేవత్ సర్కారు జలగలా పట్టిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. బకాయిల కోసం అధికారులు ఆరు రోజులుగా రోడ్డెక్కి నిరాహార దీక్షలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. సింగరేణి ఆర్జీ-3 జీఎం కార్యాలయం ఎదుట అధికారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు శనివారం నాటికి ఆరో రోజుకు చేరుకున్నాయి.
ఈ మేరకు శనివారం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు నాగెల్లి సాంబయ్యతో కలిసి ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. గత పదేళ్లలో తొలి సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థను ఎంత వేగంగా లాభాల బాటలోకి తీసుకవచ్చారో.. అంతే వేగంతో ఈ రెండేళ్లలో కాంగ్రెస్ సర్కారు దివాళా తీసే పరిస్థితికి తీసుకువచ్చిందని మండిపడ్డారు.
137 ఏండ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం అధికారులు రోడ్డెక్కె పరిస్థితి వచ్చిందంటే.. ఆ పాపం కాంగ్రెస్‌దేనన్నారు. వారి డిమాండ్లను పరిష్కరించకుంటే బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు పింగిళి సంపత్‌రెడ్డి, సెంట్రల్ కమిటీ నాయకులు దేవ శ్రీనివాస్, పొన్నం సదయ్య, కేశవరావు, శ్రీకాంత్‌రావు, బ్రాంచ్ కార్యదర్శి గండి శ్రీనివాస్‌గౌడ్, దాసరి మల్లేశ్, షరీఫ్, పూర్ణాకర్, వీవీ గౌడ్, వీరగోని సంతోష్‌గౌడ్, వెంకటేశం సుధాకర్, స్వామి, బీఆర్ఎస్ నాయకులు పూదరి సత్యనారాయణ, శెంకేసి రవీందర్, మ్యాదరవేని కుమార్, కాపురబోయిన భాస్కర్, శ్రీను, పిడుగు సురేశ్, రాఘవరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సంజీవ్, సారంగి పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

