న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అను గ్రోవర్ బదిలీగా కేవలం 10 రోజుల్లోనే బదిలీ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు శనివారం 137 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ జాబితా విడుదల చేసింది. ఇందులో ప్రత్యేక న్యాయమూర్తి అను గ్రోవర్ కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అజయ్ గుప్తా ఫాస్ట్ ట్రాక్ కోర్టు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన నీట్‌తో పాటు ఇతర పేపర్ లీక్ కేసులను విచారిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం అను గ్రోవర్ ఎన్ఐఏ చట్టం కింద ఉగ్రవాద సంబంధిత కేసులను విచారించే ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యారు. అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిన పది రోజుల వ్యవధిలోనే ఇలా బదిలీలు జరగడంపై చర్చ జరుగుతున్నది.