ముంబై: ఈ దేశాన్ని కాపాడే బాధ్యత తమకే ఉందని బీజేపీతో పాటు మరో పార్టీ కూడా భావిస్తున్నదని సీజేపీ సహ కన్వీనర్ అశుతోశ్ రాంకా శనివారం విమర్శించారు. ఆ పార్టీలో అందరూ జోకర్లే(బఫూన్స్) నని సౌరవ్ అన్నారు. ఒక ‘స్వయం ప్రకటిత ఉదారవాద వ్యవస్థ’గా చెప్పుకొనే ఆ పార్టీని లక్ష్యంగా చేసుకొని, దాని పేరు ప్రస్తావించకుండా సీజేపీ సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకా దానిపై విమర్శలు చేశారు. రాంకా తన వ్యాఖ్యల్లో ఏ పార్టీ పేరును ప్రస్తావించనప్పటికీ అస్సాం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రీతమ్ సింగ్ వాటిని తమ పార్టీకి ఆపాదించుకొని స్పందించారు. ‘అశుతోశ్..ఇప్పటిదాకా సంయమనం పాటించాను.
కానీ నీ కుట్రను, అహంకారాన్ని బయటపెడతాను. అస్సాంలో మీ నిరసనకు దూరంగా ఉండమని మీరు మమ్మల్ని కోరారు. పైగా అది ఆప్ కార్యక్రమం అని చెప్పారు. కాబట్టి దయచేసి మీ అబద్ధపు నాటకాన్ని ఆపండి. వామపక్షాలు మా నాయకుడు రాహుల్ గాంధీతో చర్చలు జరపడానికి ముందుకొచ్చినప్పుడు కేజ్రీవాల్ నుంచి వచ్చిన ప్రత్యక్ష ఆదేశాల మేరకు వారితో చర్చలు జరపకూడదని మీరు నిర్ణయించుకున్నారు’ అని ట్వీట్ చేశారు. సీజేపీ ‘ప్రజల ఉద్యమం’ అని, దాన్ని పౌరులు, సమస్యలకే పరిమితం చేయాలని కోరారు. దీనిపై సౌరవ్ దాస్ స్పందిస్తూ ‘ప్రపంచం మీ పార్టీ చుట్టూ తిరగదు. ఆ విషయాన్ని వదిలేయండి’ అని కామెంట్ చేశారు.