social media | విద్యపై దృష్టి సారించి సోషల్ మీడియాపై దృష్టి తగ్గించాలి.. చిగురుమామిడి ఎంపీడీవో రామ్మోహన్చారి
యువత విద్యపై దృష్టి సారించి సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించాలని చిగురుమామిడి ఎంపీడీవో రామ్మోహన్ చారి అన్నారు. చిగురుమామిడి మండలంలోని ముల్కనూరు, రామంచ, గునుకులపల్లి, ముదిమాణిక్యం, ఓగులాపూర్ గ్రామాల్లో గ్రామ సభలు శనివారం గ్రామ సర్పంచ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు.
social media | చిగురుమామిడి, జూన్ 6: యువత విద్యపై దృష్టి సారించి సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించాలని చిగురుమామిడి ఎంపీడీవో రామ్మోహన్ చారి అన్నారు. చిగురుమామిడి మండలంలోని ముల్కనూరు, రామంచ, గునుకులపల్లి, ముదిమాణిక్యం, ఓగులాపూర్ గ్రామాల్లో గ్రామ సభలు శనివారం గ్రామ సర్పంచ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో యువత, గ్రామస్తులు గ్రామాభివృద్ధి పై దృష్టి సారించాలన్నారు.
మురికి కాలువలు, రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. గ్రామాల్లో త్రాగు నీటి ఎద్దడి నివారణ చర్యలు, నీటిని పొదుపుగా వాడుకోవడం, మొక్కలు నాటడం మొదలు కార్యక్రమాలను చేపట్టాలని సిబ్బందికి గ్రామస్తులకు సూచించారు. ఈ గ్రామ సభలలో సర్పంచులు సాంబారి భారతమ్మ కొమురయ్య, ఒంటెల కిషన్ రెడ్డి, గునుకుల మధుసూదన్ రెడ్డి,బోయిని రమేష్, గడ్డం రమాదేవి, ఎంపీఓ బత్తిని కిరణ్ కుమార్, ఏఈ లు నిరంజన్ రెడ్డి, జ్ఞానేశ్వరి, లక్ పతి, ఇందుర్తి క్లస్టర్ పశువైద్యాధికారి సాంబరావు, పంచాయతీ కార్యదర్శులు స్వప్న, శ్రీలక్ష్మి, అరుణ్, నరేష్, సుమంత్, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

