Veenavanka | వీణవంక చెరువులో నీరు లేక చేపలు చనిపోతున్నయ్.. వీణవంక మత్స్యకారులు
వీణవంక పెద్ద చెరువులో నీరులేక చేపలు చనిపోతున్నాయని వీణవంక మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
Veenavanka | వీణవంక, మార్చి 8 : వీణవంక పెద్ద చెరువులో నీరులేక చేపలు చనిపోతున్నాయని వీణవంక మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వీణవంక మండల కేంద్రంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీణవంక పెద్ద చెరువులో సరిపడా నీరు లేక వేసవికాలం రావడంతో చేపలు చనిపోతున్నాయని, గత మూడు సంవత్సరాలుగా ఇరిగేషన్ అధికారులకు ఎన్నో సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిని అక్రమంగా తరలించడం వల్ల చేపలు చనిపోతున్నాయని వాపోయారు.
గత నాలుగు రోజులుగా ఎండల తీవ్రత ఎక్కవ ఉండటంతో చేపలు చనిపోతున్నాయని, ఆ చెరువుపై ఆధారపడి 300 ల మత్స్యకార్మిక కుటుంబాలు ఉన్నాయని, వారి బతుకులు రోడ్డున పడకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ నీటి దోపిడీని అరికట్టడంతో పాటు పై నుండి నీటిని తెప్పిస్తే చేపలు బతికే అవకాశం ఉందని, అధికారులు చొరవ తీసుకొని నీటిని తెప్పించాలని కోరారు. లేని యెడల 300 ల మత్స్యకార్మిక కుటుంబాలు రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీణవంక సొసైటీ అధ్యక్షుడు మోటం వెంకటేశ్, ప్రధానక్యాదర్శి రాయిశెట్టి కుమారస్వామి, డైరెక్టర్లు చుక్కల రవీందర్, రాయిశెట్టి రవి, రాము, ఓదెలు, సభ్యులు రాయిశెట్టి సంపత్, గుర్రం కొమురయ్య, సదానందం, రమేష్, మోహన్, సమ్మయ్య, శ్రీనివాస్, మొగిలి, వెంకటేశ్వర్లు, రాజయ్య, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Fish
- Fishermen
- Karimnagar
- pond
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

