Mudimanikyam | చిగురుమామిడి, మార్చి 2: గీత కార్మికులు తాటి వనాల్లో ప్లాస్టిక్ వాడితే జరిమానా విధించాల్సి వస్తుందని ముదిమాణిక్యం సర్పంచ్ బోయిని రమేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్లాస్టిక్ నివారణే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, తాటి చెట్టు పైన ప్లాస్టిక్ బాటిల్స్ కట్టొద్దని, ప్లాస్టిక్ బాటిల్ వాడటం వల్ల సూర్య రష్మికి వేడై మైక్రో ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు.
సర్పంచ్ రమేష్ సొంత ఖర్చులతో 22 మంది గౌడ కులస్తులకు ఒక్కొక్కరికి ఐదు కల్లు కుండలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒకవేళ గీతకార్మికులు తాడిచెట్టుకు ప్లాస్టిక్ బాటిళ్లు కట్టినట్లయితే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పూదరి పరుశురాం గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు ముంజ వెంకన్న, కార్యదర్శి మధుసూదన్, గౌడ కులస్తులు లింగన్న, వెంకన్న, రమేష్, వీరస్వామి, లచ్చయ్య, మహేందర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.