Sarangapur | సారంగాపూర్, జనవరి 26 : సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామానికి చెందిన గుండోజ్ గంగారాజు మెదడు సంబంధిత వ్యాధితో బాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. లక్షల్లో ఖర్చు అవుతుండడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికీ గ్రామానికి చెందిన పలువురు దాతలు తమ వంతుగా శస్త్ర చికిత్స కోసం వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించారు. గ్రామంలోని శివసేనా యూత్ సభ్యులు మానవత ధృక్పథంతో ఆలోచించి తమవంతుగా బాదిత కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు, పలువురు గ్రామస్థులు శివసేనా యూత్ సభ్యులను అభినందించారు.