Godavarikhani | కోల్ సిటీ : రామగుండం నియోజకవర్గం 42వ డివిజన్ పరిధిలో తిరుమల్ నగర్ కు చెందిన తాడురి శ్రీనివాస్ గౌడ్ చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించాడు. కుటుంబ పెద్ద మరణంతో తీవ్ర దుఃఖం లో వున్న వారి పరిస్థితిని చూసి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారులకు సాయాన్ని అందించాల్సిందిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ హరీష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
వారి అభ్యర్థున మేరకు వెంటనే స్పందించిన హరీష్ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని వెంటనే ఆ కుటుంబానికి అందించాల్సిందిగా వీహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులకు ఆదేశించారు. దీంతో ఆ ఫౌండేషన్ ఇంచార్జ్ సిగిరి రాము ఆధ్వర్యంలో పలువురు మృతుడి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించారు.