హుజూరాబాద్, జూలై 12: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. హుజూరాబాద్ మండలంలోని కందుగుల గ్రామ పంచాయతీ ఆవరణలో జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బక్కారెడ్డి మాట్లాడుతూ, వెంటనే రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పద్మారఘుపతి రెడ్డి, ఉప సర్పంచ్ బెల్లి రాజయ్య, సీనియర్ నాయకులు రావుల భరత్‌రెడ్డి, మండ సతీశ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ కందుగుల గ్రామాధ్యక్షుడు శివారెడ్డి, అంబేదర్ సంఘం గ్రామాధ్యక్షుడు ఇమ్మడి రమేశ్, యూత్ నాయకులు నాగరాజు, కుమార్, మహర్షి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట, జూలై 12: మండల కేంద్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. అలాగే మండలంలో అన్ని గ్రామాల్లోనూ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ విజయాగణపతి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, సర్పంచులు పుట్ట రాజు, రాజిరెడ్డి, రజితావాసుదేవరెడ్డి, మొగిలి, రఫీఖాన్, మానసామహేందర్, తిరుపతిరెడ్డి, వెంకటస్వామి, అరుణాసదానందం, దిలీప్‌రెడ్డి, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, విజయకుమార్, చిన్నరాయుడు, ఐలయ్య, మాజీ సర్పంచులు కుమారస్వామి, ఉడుత వీరస్వామి, బుర్ర రమేశ్, మాజీ ఎంపీటీసీ రాంస్వరణ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎల్లయ్య, రత్నాకర్, మహిపాల్, కౌశిక్, రాజు, కుమార్, శ్రీనివాస్, రాజయ్య, రవి పాల్గొన్నారు.
సైదాపూర్‌లో..
సైదాపూర్, జూలై 12: మండలకేంద్రంతో పాటు గ్రామాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీలపోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, ఉచిత విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డికి రైతులే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, వెన్నంపల్లి సింగిల్‌విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు చెల్మల్ల రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచులు కాయిత రాములు, కొండ గణేశ్, అబ్బిడి పద్మారవీందర్రెడ్డి, కొత్త రాజిరెడ్డి, బత్తుల కొమురయ్య, తొంట కాంతమ్మ, ఎంపీటీసీ ఓదెలు, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు పెసరు కుమారస్వామి, ముదిరాజ్ మహాసభ మండలాధ్యక్షుడు పోలు ప్రవీణ్‌కుమార్, నాయకులు కూతురు విద్వాన్‌రెడ్డి, పూసాల అశోక్, ఎల్కపల్లి రవీందర్, ఎండీ ఇమామ్, మాదం స్వామి, పోలోజు రాజు, బోళ్ల హరీశ్, నర్సింగ్, మునిపాల శ్రీనివాస్, ఏశిక ఐలయ్య, బోనగిరి అనిల్ ఉన్నారు.
వీణవంకలో..
వీణవంక, జూలై 12: మండలంలోని అన్ని గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల కేంద్రంలో కమాన్ నుంచి బస్టాండ్ వరకు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, సర్పంచులు నీల కుమారస్వామి, పోతుల నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు నీల మొండయ్య, సంపత్‌రెడ్డి, కామిడి శ్రీనివాస్‌రెడ్డి, రాజయ్య, కర్ర కొండల్‌రెడ్డి, గొడుగు రాజు, రాయిశెట్టి సంపత్, అలీమ్, సారయ్య, మహేశ్, యాసిన్, వోరెం రవి, భూమయ్య, దాసారపు లింగయ్య, రెడ్డిరాజుల రమేశ్, వేణు రవి, గౌస్, రాంగోపాల్‌రెడ్డి, రాజయ్య పాల్గొన్నారు.
హుజూరాబాద్ మండలంలో..
హుజూరాబాద్ రూరల్, జూలై 12: మండలంలోని సింగాపూర్, మందాడిపల్లి, తుమ్మనపల్లి, చెల్పూర్ తదితర గ్రామాల్లో రైతులు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామాధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.