సైదాపూర్, ఆగస్టు 6: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎక్లాస్ పూర్ వద్ద యూరియా(Urea) కోసం రైతన్నలు నిరీక్షిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఎక్లాస్ పూర్ గోదాం వద్దకు యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న రైతులు బుధవారం ఉదయం నుండే గోదాం వద్దకు చేరుకున్నారు. గోదాం వద్ద చెప్పులతో క్యూ పెట్టి సిబ్బంది కోసం వేచి చూశారు. సిబ్బంది రైతుకు 3 చొప్పున యూరియా ఇచ్చారు. కాగా మండలంలో ఎరువుల కొరత వున్నదని రైతులకు సరిపడా ఎరువులు అందించాలని రైతులు కోరుతున్నారు.