Urea | వీర్నపల్లి, సెప్టెంబర్ 1 : వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి గ్రామంలో యూరియా కావాలని గ్రామంలోని రైతులు సోమవారం యూరియా లోడ్‌తో వెళ్తున్న లారీని ఆపేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ సరిహద్దులో ఉన్న తండాలకు యూరియాను తీసుకు వెళుతున్న క్రమంలో లారీని ఆపినట్లు గ్రామస్తులు తెలిపారు.
గ్రామంలో పంచకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.