చొప్పదండి, జనవరి 9 : రైతులు ఆయిల్‌పామ్ సాగువైపు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి మండలం చాకుంటలో అన్నదమ్ములు గుడిపాటి వెంకటరమణారెడ్డి, మల్లారెడ్డి ఆయిల్‌పామ్ సాగు చేపట్టగా సోమవారం ఎమ్మెల్యే క్షేత్ర పర్యటన చేసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల వరకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో మంచినూనె దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ముందస్తుగా గ్రహించిన సీఎం కేసీఆర్ రైతు లు ఆయిల్‌పామ్ పంటలను సాగు చేయాలని సూచిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచు పెద్ది శంకర్, ఎంపీటీసీ గోపు మంగ, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు అప్షన్ పాషా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మాచర్ల వినయ్, గోపు నరేందర్‌రెడ్డి, మావు రం మహేశ్, రావన్ పాల్గొన్నారు.