saidaapoor | సైదాపూర్, కరీంనగర్ : రైతులకు సరిపడా ఎరువులను అందించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ఎరువులను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయం లో రైతులకు కాళేశ్వరం ద్వారా సాగు నీరు అందిచడం తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు.
ఒక వైపు ఎరువుల కొరత లేదని అధికారులు చెబుతుంటే రైతులకు మాత్రం ఎరువులు అందడం లేదంన్నారు. అధికారులు ఎరువుల పంపిణి కేంద్రాలకు వస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తయాన్నారు. రైతులకు ఎరువులు సకాలంలో అందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చెప్పాడుతామన్నారు. రైతులకు అండగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు మునిపాలా శ్రీనివాస్, చాడ ఆదిరెడ్డి, హరీష్ రావు, నరేష్ తదితరులు రైతులు పాల్గొన్నారు.