Fertilizers | సైదాపూర్ (కరీంనగర్ జిల్లా) : ఎట్లుండే తెలంగాణ, ఎట్లాయరా?.. కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో సంతోషంగా ఉన్న రైతులు (Farmers) ఇప్పడు సమస్యలతో సతమతమవుతున్నారు. పంటలకు నీళ్లు సరిగా రాక, కరెంటు సరిగా లేక, రైతు బంధు రాక, రుణమాఫీ కాక, అప్పులు పుట్టక, ఎరువులు దొరక్క వెరసి పంటలు పండక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సైదాపూర్ మండలంలోని ఈ దృశ్యమే ఇందుకు నిదర్శనం.
మండలంలోని వెన్నెంపల్లి సింగిల్ విండో ఎదుట యూరియా కోసం రైతులు తెల్లవారక ముందే బారులు తీరారు. యూరియా కొరత ఉన్నందున తమకు ఎరువులు దొరుకుతాయో లేదో అని కార్యాలయం ఎదుట చెప్పులు, రాళ్లు, డబ్బాలతో క్యూ పెట్టి ఎదురు చూశారు . అనంతరం సీరియల్ ప్రకారం ఎరువులు తీసుకున్నారు. చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డిని వివరణ కోరగా యూరియా, ఎరువులు సరిపడా నిలువలు ఉన్నాయని అందరికి అందిస్తామన్నారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ
Maha Kumbh Mela | మాఘ పౌర్ణమి.. 1.83 కోట్ల మంది పుణ్యస్నానాలు