సరిపడా యూరియా తెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈశ్వర్ రైతులకు బాసటగా నిలిచిన నేపథ్యంలో స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం విండోకు ఒక లారీ లోడ్ యూరియాను కేటాయించగా ధర్మారం మండల కేంద్రంలోని గోదాముకు వచ్చింది. లారిలో 340 యూరియా బస్తాలు రాగా అప్పటికే ఉదయం గోదాం వద్దకు 500 పైబడి రైతులు చేరుకున్నారు. యూరియా పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో పోలీస్ సిబ్బంది ముందస్తుగా అక్కడ వచ్చారు.
దీంతో రైతులు తమ వెంట తెచ్చుకున్న ఆధార్ కార్డు, భూమి పట్టాదారు పాస్ పుస్తకాల జిరాక్స్ ప్రజలను సింగిల్ విండో సిబ్బందికి అప్పగించారు. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిన రైతులు తమకు యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి తదితర నాయకులు చేరుకొని రైతులకు మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు యూరియా గురించి ఆరోపణలు చేయగా బీఆర్ఎస్ నాయకులు వారి ఆరోపణలకు దీటైన సమాధానం చెప్పారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడు కూడా రైతులు యూరియా కోసం గోదాముల వద్ద క్యూలైన్లు కట్టిన పరిస్థితి లేదని వారు వివరించారు.
ఓ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాబీ నేతలు దీటైన జవాబు ఇచ్చి రైతులకు అవసరమైన యూరియాను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెప్పించడం లేదని బీఆర్ఎస్ నాయకులు వారిని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు సరిపడా యూరియాను అందించాలని ఉద్దేశమే లేదని వారు ఖరాఖండిగా చెప్పారు. రైతులు తమ పొలాలకు యూరియా వేయడానికి రోజుల తరబడి సింగిల్ విండో గోదాంలకు వచ్చి వేచి ఉండడం ఎంతో బాధాకరంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కాగా లారీ నుంచి యూరియా లోడ్ గోదాం లోకి అన్లోడ్ అయిన తర్వాత అక్కడ వరుస క్రమంలో పెట్టిన ఆధార్ ప్రకారం బోట్ల వనపర్తి రైతు వేదిక క్లస్టర్ ఏఈవో రాహుల్ సమక్షంలో పోలీస్ బందోబస్తు మధ్య ఎన్ని ఎకరాల భూమి ఉన్నప్పటికీ ఒక్కో రైతుకు 2 యూరియా బస్తాల చొప్పున సింగిల్ విండో సిబ్బంది పంపిణీ చేశారు.
కేవలం 170 మంది రైతుల వరకే ఆ యూరియా బస్తాలు సరిపోయాయి. మిగతా రైతులు మధ్యాహ్నం వరకు వేచి ఉండగా సాయంత్రం మరో యూరియా లోడ్ వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు నచ్చ చెప్పడంతో రైతులు నిరాశతో వెనుతిరిగి పోయారు. కాగా మొత్తానికి యూరియా బస్తాలు దొరకని రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి యూరియా కొరతను చూడలేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరిపడా యూరియా తెప్పించి వరి పొలాలు నష్టపోకుండా చూడాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.