Jagityal | జగిత్యాల రూరల్/రాయికల్, మే 23: అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ను కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. అర్బన్ మండలంలోని గోపాల్ రావు పేట ఐకెపి సెంటర్ లో గురువారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసింది. తడిసిన ధాన్యంను వెంటనే కొనుగోలు చేయాలని, జగిత్యాల ధర్మపురి జాతీయ రహదారిపై రైతులు అరగంట సేపు ధర్నా చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.
విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ బి ఎస్ లత, ఐకేపీ సెంటర్ను పరిశీలించి తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
రాయికల్ : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా పరిషత్ మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావసంత డిమాండ్ చేశారు.రాయికల్ మండలంలోని శ్రీ రాంనగర్, సింగర్ రావు పేట్ గ్రామాలలో అకాల వర్షాలతో తడిచిన వరి ధాన్యాన్ని రైతులు, నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ధర్నాకు దావ వసంత మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూప్రభుత్వం వెంటనే స్పందించి తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. రేవంత్ ప్రభుత్వం రైతుని రాజుని చేస్తానని రోడ్డు పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డుపై ఎక్కడికి అక్కడ రైతులు ధర్నాలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని గత బిఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బర్కం మల్లేష్ యాదవ్, నాయకులు చాంద్,రాజేశ్వర్ రెడ్డి, జలపతి రెడ్డి, గంగ రెడ్డి, రాజమౌళి, చంద్రయ్య, శ్రీను, రవి, మల్లారెడ్డి, నరేష్, లక్ష్మణ్, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.