జగిత్యాల రూరల్, నవంబర్ 7 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, అభ్యర్థి మాగంటి సునీత గెలువడం ఖాయమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్ పేట్ డివిజన్ క్యూత్బ్ షాహి 7ట్యూంబ్స్ ప్రాంతంలో ప్రచారం చేశారు. జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఓట్లు అభ్యర్థించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన ప్రగతిని వివరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.