Veenavanka | వీణవంక, ఆగస్టు 22: ప్రతీ ఒక్కరు తాగునీటి విషయంలో పరిశుభ్రత పాటించాలని మిషన్ భగీరథ ఎస్ఈ రాములు అన్నారు. మండలంలోని బేతిగల్ గ్రామంలో వైరల్ ఫీవర్, జాండీస్ వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మిషన్ భగీరథ ఎస్ఈ రాములు శుక్రవారం సందర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెల్సుకున్నారు. గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, వాటర్ ప్లాంట్లను పరిశీలించారు.
ఇన్పుట్, ఔట్పుట్ వాటర్‌ను పరిశీలించి, ఏఈ శ్రీనివాస్ తో మాట్లాడారు. వైద్యపరీక్షల కోసం మరోమారు మంచినీటి నమూనాలు సేకరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వాటర్ ట్యాంక్‌లు పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందకుండా తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ ఇంట్రా శ్రీనివాస్, డీఈ గ్రిడ్ టీ బాలరాజు, ఎంపీడీవో మేరుగు శ్రీధర్, ఎంపీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.