Environment | హుజురాబాద్ రూరల్, అక్టోబర్ 29 : పర్యావరణం పట్ల అవగాహన అందరికీ అవసరమని.. మానవ నాగరికత జీవితంలో ఎన్నో వస్తువులను, పదార్థాలను పరికరాలను మానవుడు ఉపయోగిస్తున్నాడని, ఉపయోగం తర్వాత వాటిని ఏ విధంగా పర్యావరణంలో కలిపి వేయాలి అనేది ఒక సమస్య అని కిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే .శంకర్ అన్నారు.
బుధవారం సింగాపురం కిట్స్ కళాశాలలో హరితాన్ ఎకో హ్యాకథాన్ 2025 ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రిన్సిపాల్ శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం నివసిస్తున్న భూమి ఎన్నో కాలుష్యాలను ఎదుర్కొంటున్నదని, మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ సమస్యను ఒక క్లిష్టమైన సమస్యగా పరిగణిస్తున్నాయని అన్నారు.
వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, సంస్థలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నాయని వివరించారు. మనం తయారు చేసే ఏ వస్తువైనా వాటిని ఉపయోగించిన తర్వాత సులభంగా పర్యావరణంలో కలిసిపోవాలని వివరించారు. ఈ వాతావరణ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ద్వారా ఇస్తున్నదని, విద్యార్థులు తమ పరిష్కారాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించవచ్చునని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమ సమన్వయ కర్త, డీన్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ యోగేష్ పుండలిక్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ విద్యాసంస్థల నుండి విద్యార్థులు పాల్గొంటున్నారని వివరించారు. ఈ ప్రదర్శనకు కళాశాల డీన్ ఐక్యూఏసీ డాక్టర్ ఎం. వి. సతీష్ కుమార్, కళాశాల డీన్ ఆర్అండ్డీ డాక్టర్ కే ప్రవీణ్ కుమార్ రావు, హ్యుమానిటీస్ విభాగ అధ్యాపకుడు డాక్టర్ రవికుమార్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఈ పోటీలో మొదటి 3 స్థానాలు పొందిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారని వివరించారు. విజేతలకు బహుమతులు, పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కళాశాల కార్యక్రమ సమన్వయకర్త అధ్యాపకులు డాక్టర్ ఏ. కొమురయ్య వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమము తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ కరీంనగర్ సౌజన్యంతో ఏర్పాటు చేశారు.
Landslides | భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్కు అంతరాయం
Suicide: భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. సౌదీలో ఆత్మహత్య చేసుకున్న భర్త
Jaanvi Swarup | హీరోయిన్గా మహేష్ బాబు మేనకోడలు..సంతోషం వ్యక్తం చేసిన మంజుల