గోదావరిఖని, సెప్టెంబర్ 23: రాష్ట్ర సర్కారు చేస్తున్న అభివృద్ధి చూసి ప్రతి ఒక్కరూ ఆకర్శితులవుతున్నారు. బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. రామగుండం నగరపాలక మాజీ డిప్యూటీ మేయర్, బీజేపీ నాయకుడు ముప్పిడి సత్యప్రసాద్, మాజీ కార్పొరేటర్లు షమీమ్ సుల్తానా, హైమద్ బాబు, వనం శివానందం బాబు, బాబుమియా, బొబ్బొలి సతీశ్, కత్తెరమల్ల రమేశ్‌తోపాటు నాయకులు యశ్వంత్‌రెడ్డి, సాయికుమార్ బీఆర్ఎస్లో చేరారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమక్షంలో మంత్రి హరీశ్‌రావు వీరందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ హ్యట్రిక్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రామగుండంలో కోరుకంటి చందర్‌ను 50వేల భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ప్రారంభించామని, సబ్ రిజిస్టార్ కార్యాలయం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టును మంజూరు చేయించామన్నారు. ఇక్కడ రామగుండం నగరపాలక డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, రామగుండం నియోజకవర్గ చేరికల కమిటీ సభ్యులు జాయుద్పాష, నాయకులు కందుల సతీశ్, నారాయణదాసు మారుతి, తదితరులు ఉన్నారు.