జమ్మికుంట, డిసెంబర్ 19: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల జీవితాలకు భరోసా కల్పిస్తున్నదని, వైద్య ఖర్చుల కింద బిల్లులతో కూడిన దరఖాస్తులు అందించగానే బాధితులకు సర్కారు చెక్కులు పంపిస్తున్నదని జమ్మికుంట మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేశ్ గౌడ్ పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన మామునూరి దశరథరాములు ఇటీవల సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహకారంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.52,500 చెక్కు మంజూరైంది.
ఈ మేరకు చెక్కును సోమవారం బాధితుడికి కౌన్సిలర్ నరేశ్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపల్ ప్రజల తరఫున సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా జమ్మికుంటను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధుల వరద పారిస్తున్నదని, అందరి సహకారంతో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇక్కడ కొడారి స్వామి, పాత రాజేశ్, స్వరాజ్ తదితరులున్నారు.