ఇది దద్దమ్మ ప్రభుత్వమని పొంగులేటే ఒప్పుకున్నడు
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల ఫోన్లను బీఆర్ఎస్ పార్టీ ట్యాపింగ్ చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు.
- మంత్రుల ఫోన్లను బీఆర్ఎస్ ఎట్ల ట్యాపింగ్ చేస్తది..?
- రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా..? బీఆర్ఎస్సా..?
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల ఫోన్లను బీఆర్ఎస్ పార్టీ ట్యాపింగ్ చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. చాలాకాలంగా రేవంత్ సర్కార్ సొంత మంత్రుల ఫోన్లను టాప్ చేస్తున్నదని తాము చెప్తూనే ఉన్నామని, పొంగులేటి వ్యాఖ్యలతో దానికి బలం చేకూర్చిందని పేర్కొన్నారు. అలాగే తమది దద్దమ్మ ప్రభుత్వమని స్వయంగా పొంగులేటి ఒప్పుకున్నాడని తెలిపారు. వాస్తవానికి సీఎంపై అనుమానంతో ఉన్న పొంగులేటి బీఆర్ఎస్పై నెపం నెట్టినట్టు స్పష్టమవుతున్నదని అన్నారు. బుధవారం సూర్యాపేట 44వ వార్డులో ఓ టు హక్కును వినియోగించుక్ను అనంతరం మీడియాతో మాట్లాడారు. పొంగులేటి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా జగదీశ్‌రెడ్డి పైవిధంగా స్పందించారు. అధికారంలో ఉన్నది కాం గ్రెస్సా.. బీఆర్ఎస్సా అన్న సోయి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నది రేవంతేనని స్పష్టంచేశారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్పై దాడులు చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించేందుకు సహకరించాలని సీఎం స్థాయిలో ఉ ద్యోగులతో టెలికాన్ఫరెన్స్ పెట్టడం సిగ్గుచేటని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

