హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి బుధవారం మళ్లీ ఢిల్లీ విమానం ఎ క్కారు. కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బుధ వా రం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తోనూ భేటీ అయినట్టుగా సమాచారం. ఇక గురువారం పలువు రు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లడం 62వసారి కావడం గమనార్హం.