సిరిసిల్ల రూరల్, ఆగస్టు 17 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యతోపాటు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో సర్కారు దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజల నుంచి ఆదరణ పెరగడంతో పాటు నమ్మకం వస్తున్నది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో అందుతున్న వైద్య సేవలకు అరుదైన గుర్తింపు వస్తున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా దవాఖానతోపాటు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ మెరుగైన వైద్య సేవలందుతున్నాయి. అధునాతన పరికరాలు ఏర్పాటు చేయగా, వైద్యులు అందుబాటులో ఉంటూ ప్రైవేటు దీటుగా వైద్యం అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
గతంలో వేములవాడ, ఇటీవల కోనరావుపేట, సిరిసిల్లలోని పీఎస్నగర్ అర్బన్, బోయినపల్లి, కొదురుకుపాక, తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ఎన్క్వాస్ సర్టిఫికెట్లు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, గురువారం తంగళ్లపల్లి మండలం నేరెల్ల పీహెచ్సీకి ఎన్క్వాస్ సర్టిఫికెట్ రావడం విశేషం. అతి తక్కువ సమయంలో 6 పీహెచ్సీలకు ఎన్క్వాస్ సర్టిఫికెట్ వచ్చిన జిల్లాగా రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల గుర్తింపు పొందడం మరో విశేషం. ఈ సర్టిఫికెట్ రావడం ద్వారా దవాఖాన అభివృద్ధికి ప్రతి సంవత్సరం రూ.3 లక్షల చొప్పున రూ.9 లక్షలు రానున్నాయి. దీంతో మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉన్నది.
ఎన్క్వాస్ సర్టిఫికెట్ రావడానికి సహకరించిన కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు, జిల్లా ప్రొగ్రాం అధికారులకు,జిల్లా క్వాలిటి మేనజర్ విద్యాసాగర్, డీపీవో ఉమాదేవి ఎన్క్వాస్ సర్టిపికేట్తో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందింస్తాం.
నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు వైద్యపరీక్షలు అందిస్తున్నారు. పీహెచ్సీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందిస్తున్నారు. 14న జాతీయ వైద్య సేవల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు,గర్భీణీలకు టీకాలు అందిస్తారు. కొవిడ్ వ్యాక్సిన్ కూడా అందిస్తున్నారు. హెచ్సీలో 4 బెడ్లు ఉన్నాయి. నలుగురికి ఇన్ఫేషంట్ సౌకర్యం ఉన్నది.ఇతర ప్రాథమిక వైద్యసేవల్ని అందిస్తున్నారు.
నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈ ఏడాది జూలై 19, 20లో వైద్యులు పునీత్జా, సీమ కేంద్ర బృందం ఆధ్వర్యంలో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్ (ఎన్క్వాస్) ప్రోగ్రాం నిర్వహించారు. రెండు రోజుల పాటు క్షేత్ర స్థాయిలో వైద్య సేవలు, నిర్వహణపై పర్యవేక్షించారు. దీని ఫలితంగానే ఎన్క్వాస్ సర్టిఫికెట్ అందించారు. తంగళ్లపల్లి పీహెచ్సీ 81.25 శాతం క్వాలిటీ సర్టిఫికెట్ రావడం విశేషమని ప్రాథమిక వైద్యాధికారి రేఖ తెలిపారు.
మంత్రి కేటీఆర్ ,కలెక్టర్ అనురాగ్ జయంతి సంపూర్ణ సహకాంరతోనే జిల్లాలో ఇప్పటివరకు 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎన్ క్వాస్ సర్టిఫికెట్లు వచ్చాయి. మిగిలిన దవాఖానలకు ఎన్క్వాస్ సర్టిఫికెట్లు వచ్చేలా కృషి చేస్తున్నాం. ఎన్క్వాస్ సర్టిఫికేట్ వచ్చిన ఆసుపత్రులకు మూడేండ్లలో ప్రభుత్వం నుంచి రూ.9లక్షలు అదనంగా ఈ దవాఖానాలకు రానున్నాయి. తద్వారా పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది.
– జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు