చిగురుమామిడి ఏప్రిల్ 15 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో బోల్లి లింగయ్య లచ్చవ్వ దంపతులకు చెందిన మొక్కజొన్న చేను విద్యుత్ సర్క్యూట్ తో కాలి బూడిదయింది. ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న చేతికి వచ్చే దశలో పంట సుమారు 20 గుంటల వరకు అగ్నికి బుడిదయింది. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ గూళ్ల రజిత వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు 20 నుండి 30 వేల వరకు నష్టం వాటిలిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం అందించాలని సర్పంచ్ ప్రభుత్వాన్ని కోరారు.