– సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు
తుంగతుర్తి, జూలై 31 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న జరిగే జైలు భరోను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు పిలుపునిచ్చారు. శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ రైతులకు ఇచ్చే ఎరువులపై సబ్సిడీలను ఎత్తివేసిందని ఎరువుల ద్వారా విపరీతంగా పెంచిందని యూరియా సకాలంలో అందక రైతులు తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. విద్యుత్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం ద్వారా మోటార్లకు మీటర్లను పెట్టి రైతులకు కోలుకోలేని దెబ్బతీస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధరలు లేక మార్కెట్లో సరైనటువంటి వసతులు లేకపోవడం సరుకులు అమ్ముకోలేని స్థితిలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కానీ ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయకుండా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు బానిస సేవలు చేపిస్తుందన్నారు. స్కీము వర్కర్లను పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా అనేక రకాల భారం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైందని ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకే ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకొని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న సిపిఎం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే జైలు మరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాసు, కందాల శంకర్ రెడ్డి,వజ్జే శ్రీను, పల్లా సుదర్శన్, బత్తుల జనార్ధన్, సిగ వెంకన్న, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.