KCR | తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తమ అభిమాన నేత, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు తిరిగి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష రోజు రోజుకూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో బలపడుతున్నది. ఈ మేరకు ఇప్పటికే పలు సందర్భాల్లో పాదయాత్రలు, తదితర దీక్షల ద్వారా కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్న విషయం తెలిసిందే.
ఇదే కోవలో మరో ముగ్గురు యువకులు మంథని నుండి పాదయాత్ర చేస్తూ ఆదివారం నాడు ఎర్రవెల్లి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ ప్రగతి సాధకుడు కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి గాడిలో పడుతుందని, ఉద్యోగ ఉపాధి రంగాల్లో తెలంగాణ యువతకు అవకాశాలు మెరుగవుతాయని పాదయాత్ర చేసిన ముగ్గురు యువకులు మంథని బెన్నిపాల్, బూర్ల వెంకటేశ్, కొండ వెంకటేశ్ తెలిపారు.
మంథని నుండి పాదయాత్ర చేస్తూ వచ్చిన బిఆర్ఎస్ యువ కార్యకర్తలను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు. తనపట్ల వారు చూయించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవ్వడమే గాక, పూర్తి విరుద్ధంగా పనిచేస్తున్నదనే విషయాన్ని ప్రజలు గ్రహించారని, తమ పాదయాత్ర సందర్భంగా ప్రజలతో వారి అనుభవాలను కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.
కేసీఆర్ పాలనలో తాము అనుభవించిన పాలనా ఫలితాలను రాష్ట్ర ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని, కాంగ్రేస్ హామీలను నమ్మి మోసపోయి తాము ఏమి కోల్పోయామో అర్థం చేసుకున్నారని వారు తెలిపారు. మంథనితోపాటు రాష్ట్ర ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నే తిరిగి ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవడం ఖాయమని పాదయాత్ర చేసిన యువకులు స్పష్టం చేశారు.
Watch: ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను పట్టుకున్న భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Nani | బిగ్‌బాస్ జోలికి వెళ్లేది లేదు.. మరోసారి హోస్ట్‌గా కనిపించనంటూ క్లారిటీ!
Kainat Imtiaz | అమ్మ బాటలో నడవాలని.. అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థానీ పేసర్ వీడ్కోలు..!