Elections | కాల్వశ్రీరాంపూర్, డిసెంబర్ 8 : ఈ నెల 11 న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి డిసీపీ భూక్యా రాం రెడ్డి అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామల్లోని పోలింగ్ కేంద్రలను పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి ఏసీపీ గజ్జి కృష్ణ సోమవారం పరిశీలించారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థులు, యువత, గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పలు సూచనులు చేశారు.
ఈ సందర్భంగా డిసీపీ భూక్యా రాం రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు, యువత, గ్రామస్తులు, ఎన్నికల రోజు గొడవలకు తావు లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తొమ్మిది గ్రామాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రశాంతత వాతావరణంలో ఎన్నికలు జరిగినందుకు ప్రజలు కృషి చేయాలని వారు కోరారు. ఎన్నికల్లో ప్రతీ ఓటరు ఎలాంటి భయాందోళనలు, ఒత్తిళ్లకు గురికాకుండా దైర్యంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.