Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 8 : చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ముస్కుల రమణారెడ్డి, ఉపాధ్యక్షులుగా గోగూరి వేణు మాధవరెడ్డి, సందీ రాజిరెడ్డి, కార్యదర్శిగా శ్యామకూర చంద్రశేఖర్ రెడ్డి, సహాయ కార్యదర్శి ఒంటెల రాజవర్ధన్ రెడ్డి, కోశాధికారి గాదె రమణ రెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా గోగూరి మురహరి రెడ్డి, ముస్కుల కృష్ణారెడ్డి, శ్యామకూర సంపత్ రెడ్డి, ముస్కుల సుధాకర్ రెడ్డి, ముస్కుల రాజిరెడ్డి తో పాటు 8 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడుతూ గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామన్నారు. నిరుపేద రెడ్డి కులస్తులకు చేయూతనందిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామన్నాడు. తన నియామకానికి సహకరించిన వారందరికీ రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.