Utsava Committee | ధర్మారం, జులై 21: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో నిర్వహించే తలపెట్టిన పోచమ్మ ఎల్లనంపుడు ఉత్సవ కమిటీని సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నుకున్నారు. గ్రామంలోని వివిధ కుల సంఘాల సభ్యులంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. .
గ్రామంలో మహాలక్ష్మి, భూలక్ష్మి విగ్రహాల పునః చేయడంతో పాటు పోచమ్మ ఎల్లనంపుడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అందుకు ప్రత్యేక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించి కొత్త కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.
ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా సముద్రాల ఆశోక్ రావు, కొడారి హన్మయ్య, అలువాల రాజేశం, ముత్యాల చoద్రశేఖర్ అధ్యక్షుడిగా చొప్పరి చoద్రయ్య, ఉపాధ్యక్షులుగా జుంజిపెల్లి రమేష్, తమ్మడవేణి రవీందర్, బాలసాని లింగయ్య, వెన్నం రమేష్, ప్రధాన కార్యదర్శులుగా పెర్క బానేష్, జుంజిపెల్లి దిలీప్, కోశాధికారిగా అనుమాల సాగర్, కార్యదర్శులుగా ఎలిగేటి రమేష్, పల్లపు ప్రసాద్, కుంభం లక్ష్మణ్ తదితరులను ఎన్నుకున్నారు.